అసలు పవన్ కళ్యాణ్ మాతో మాట్లాడే వారే కాదు అంటున్న రావెల కిషోర్ బాబు..!

Written By Aravind Peesapati | Updated: June 11, 2019 17:33 IST
అసలు పవన్ కళ్యాణ్ మాతో మాట్లాడే వారే కాదు అంటున్న రావెల కిషోర్ బాబు..!

అసలు పవన్ కళ్యాణ్ మాతో మాట్లాడే వారే కాదు అంటున్న రావెల కిషోర్ బాబు..!
 
జనసేన పార్టీకి ఇటీవల రావెల కిషోర్ బాబు రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసినదే. పవన్ కళ్యాణ్ పార్టీని వీడిన తర్వాత రావెల కిషోర్ బాబు ప్రధాని మోడీ పర్యటన లో బీజేపీ కండువా కప్పుకోవడం జరిగింది. అయితే ఇటీవలే గుంటూరు లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న రావెల కిషోర్ బాబు జనసేన పార్టీ పై మరియు పవన్ కల్యాణ్ ప్రవర్తన పై షాకింగ్ కామెంట్ చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీలో తనకు ఇచ్చిన పదవి నామమాత్రమేనని ఏదైనా సలహాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తీసుకునే వారు కాదని... నాతో మాట్లాడే వారే కాదు అన్నట్టుగా రావెల కిషోర్ బాబు పవన్ కళ్యాణ్ తీరుపై వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నేను పార్టీలో ఒక కీలకమైన నేతగా ఉన్నప్పటికీ కూడా కనీసం పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కూడా తనకు దొరికేది కాదని, ఫోన్లో కూడా మాట్లాడే వాళ్లు కాదని చెప్పారు. పైకి సన్నిహితంగా కనిపించినప్పటికీ, రాజకీయపరమైన వ్యూహాలపై మాట్లాడానికి కూడా తనకు అసలు అవకాశం రాలేదని విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జనసేన కి టీడీపీ తో పొత్తు ఉందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం ప్రజల అపనమ్మకం వల్లనే జనసేనకి సరిగా ఓట్లు పడలేదని రావెల స్పష్టం చేశారు.
Top