అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు చెప్పిన జగన్ ప్రభుత్వం..!

Written By Aravind Peesapati | Updated: June 11, 2019 17:46 IST
అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు చెప్పిన జగన్ ప్రభుత్వం..!

అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు చెప్పిన జగన్ ప్రభుత్వం..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన సమస్యలలో ఒక సమస్య అయినా అగ్రిగోల్డ్ సమస్యపై జగన్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా తన ఫస్ట్ క్యాబినెట్ సమావేశంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రులతో జరిగిన సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా జగన్ మంత్రులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రూ.1,150 కోట్లు హైకోర్టులో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు తక్షణమే డబ్బు చెల్లించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వేలంలో అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల మెుత్తాన్ని అంతా ఒకేసారి వేలం వేయకుండా ఆస్తులను కొన్ని విభాగాలుగా విభజించి అమ్మకాలు జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర హైకోర్టుకు సూచనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.250 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్‌ ఖాతాదారులను మోసం చేసిందని మంత్రి నాని ఆరోపించారు.
Top