ఎమ్మెల్యే లకి హుకుం జారీ చేసిన చంద్రబాబు!

Written By Xappie Desk | Updated: June 12, 2019 13:34 IST
ఎమ్మెల్యే లకి హుకుం జారీ చేసిన చంద్రబాబు!

ఎమ్మెల్యే లకి హుకుం జారీ చేసిన చంద్రబాబు!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా సభలో తనకంటే ఎమ్మెల్యేలు ఎక్కువగా మాట్లాడాలని పార్టీ 23 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
 
ఏ విధంగానైనా అధికార పార్టీ విమర్శలు చేస్తే తగిన విధంగా ఘాటైన రిప్లై లు ఇవ్వాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు తెలియజేసినట్లు టాక్. అంతేకాకుండా శాసనసభ సమావేశాల తొలిరోజు అందరూ పసుపు చొక్కాలతో అసెంబ్లీకి హాజరుకావాలని ఉదయం 9.30 గంటలకల్లా ఉండవల్లిలోని అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని అక్కడ్నుంచి వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవాలని నిర్ణయించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాయకత్వ సామర్థ్యం బయటపడుతుందని చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పారు.
Top