అసెంబ్లీ లో లోకేశ్ .. ఓడిపోయాడు కదా అంటారా .. అదే మరి ట్విస్ట్ !

Written By Xappie Desk | Updated: June 15, 2019 10:21 IST
అసెంబ్లీ లో లోకేశ్ .. ఓడిపోయాడు కదా అంటారా .. అదే మరి ట్విస్ట్ !

అసెంబ్లీ లో లోకేశ్ .. ఓడిపోయాడు కదా అంటారా .. అదే మరి ట్విస్ట్ !
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మూడో రోజు అసెంబ్లీ సమావేశాలలో టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత బయటకు రాని నారా లోకేష్ తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు లోకేష్ రావడంతో అందరూ షాక్ తిన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ పడి ఓడిపోయిన నారా లోకేష్ అసెంబ్లీకి గతంలో ఎమ్మెల్సీ పదవి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
 
ఈ సందర్భంగా నారా లోకేష్ సభలో ఉన్న వైసిపి పార్టీకి చెందిన నాయకులను మరియు ఇతర పార్టీల నాయకులను కరచాలనం చేసి పలకరిస్తూ అసెంబ్లీ లో సందడి చేశారు. అసెంబ్లీలో చాలా మంది నాయకులను కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించారు. అంతేకాకుండా కడప అసెంబ్లీ నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అంజాద్ బాషా - విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన లోకేశ్... అక్కడే కనిపించిన వైసీపీ సీనియర్ నేత - ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిని కూడా ఆత్మీయంగా పలకరించారు. మొత్తం మీద ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ అసెంబ్లీలో అందరినీ పలకరిస్తూ పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరించారు.
Top