ఆంధ్రప్రదేశ్ లో ఆసుపత్రి దారుణాలు జగన్ స్పందించాల్సిందే .. !

Written By Xappie Desk | Updated: June 17, 2019 09:56 IST
ఆంధ్రప్రదేశ్ లో ఆసుపత్రి దారుణాలు జగన్ స్పందించాల్సిందే .. !

ఆంధ్రప్రదేశ్ లో ఆసుపత్రి దారుణాలు జగన్ స్పందించాల్సిందే .. !
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయిన జగన్ సీఎం కుర్చీ లో కూర్చున్నాక సంచలనకరమైన స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా గతంలో ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ను తానే స్వయంగా పర్యవేక్షిస్తన్నని జగన్ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నప్పటికీ జగన్ స్పెషల్ గా పట్టించుకుంటారు అని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రుల పరిస్థితి చాలా దయనీయంగా దారుణం గా మారాయి. రాష్ట్రంలో చాలా ఆసుపత్రులలో కరెంటు లేక వైద్యం వికటించి చాలా మరణాలు సంభవిస్తున్నాయి ప్రస్తుతం.
 
ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి అయితే చాలా దారుణంగా మారిపోయాయి. అనంతపురం సర్వజనాసుపత్రిలో.. ఎప్పుడూ లేని విధంగా చిన్న పిల్లలు మరణిస్తున్నారు. గత పది రోజులుగా… ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఇరవై మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. రోగులు తీవ్రంగా ఆందోళన చెందుతూండటంతో.. హుటాహుటిన వైద్య మంత్రి ఆళ్ల నాని అనంతపురం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు, సిబ్బంది… ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో.. రోగులు… మంత్రికి చెప్పారు. నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఆస్పత్రి మారిందని.. పట్టించుకునేవారు లేరని.. రోగులు.. ఎంత మొత్తుకున్నా.. మంత్రులు, ప్రజాప్రతినిధులు.. వచ్చి.. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని.. మేం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఇంకా చాలా చోట్ల ఇటువంటి పరిస్థితే రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దీంతో చాలా మంది రోగులు ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాన్ని గట్టిగా పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Top