పాపం బీజేపీ !

Written By Xappie Desk | Updated: June 17, 2019 10:14 IST
పాపం బీజేపీ !

పాపం బీజేపీ !
 
ఉత్తర భారతంలో రాణిస్తున్న బిజెపి దక్షిణ భారతదేశంలో ప్రజాభిమానాన్ని పొందడానికి నానా తంటాలు పడుతుంది. ఒక్క కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడ బిజెపి పార్టీకి అంతగా ఆదరణ లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ పరిస్థితి చూస్తే పాపం అన్నట్టుగా ఉంది. 2014 ఎన్నికలలో టిడిపి పార్టీలు కలిసి పోటీ చేసి కొద్దో గొప్పో స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆంధ్ర ప్రజల దృష్టిలో బిజెపి పార్టీ పరిస్థితి చాలా హీనంగా మారింది.
 
అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ కూడా ప్రత్యేక హోదా గానమే ఎత్తడం తో ఇప్పటికిప్పుడు ఏపీలో బీజేపీ పార్టీ పరిస్థితి మెరుగు పడే అవకాశాలు లేనట్టుగానే ఉన్నాయి. ఏది ఏమైనా ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ ద్రోహమే చేసిందని ఆంధ్రప్రదేశ్ దృష్టిలో చాలా బలంగా ప్రింట్ పడిపోయింది. ఎప్పుడైనా ప్రత్యేక హోదా అంశం కేంద్రం దగ్గర అయితే కేంద్ర పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే చాలా చేశామని వాదన వినిపిస్తున్నారు. దీంతో ఈ వాదనతో ఏపీ ప్రజలు భాజ‌పా పై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. దాన్ని పూర్తిగా చ‌ర్చ‌ల్లో లేకుండా చేసి, ఏపీ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌గ‌లిగితేనే భాజ‌పాపై కాస్తోకూస్తో సానుకూల‌తకు ఆస్కారం ఉంటుంది.
Top