మోడి రెండో సారి ప్రధాని అయ్యాక తీసుకునే సంచలన నిర్ణయం ఇదే .. నోట్ల రద్దు కంటే దారుణం ?

Written By Xappie Desk | Updated: June 17, 2019 10:16 IST
మోడి రెండో సారి ప్రధాని అయ్యాక తీసుకునే సంచలన నిర్ణయం ఇదే .. నోట్ల రద్దు కంటే దారుణం ?

మోడి రెండో సారి ప్రధాని అయ్యాక తీసుకునే సంచలన నిర్ణయం ఇదే .. నోట్ల రద్దు కంటే దారుణం ?
 
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో రెండోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గత సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి వచ్చి ప్రధాని అయిన మోడీ నోట్ల రద్దు అని నిర్ణయం తీసుకుని దేశంలోనే సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న నినాదం పైకి తీసుకురావాలని చూస్తున్నారు. అన్ని పార్లమెంట్ స్థానాల తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగేలా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోబోతున్నట్లు జాతీయ రాజకీయాల వినబడుతున్న టాక్.
 
ప్రతీ ఏడాది… నాలుగైదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల ఎన్నికలు.. ఒక్కో ఏడాదిలో జరుగుతున్నాయి. దాని వల్ల… అత్యధిక కాలం ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు వస్తుందని… దీని వల్ల అభివృద్ది కుంటుపడుతుందని భావిస్తున్నారు. అందుకే.. “ఒకే దేశం – ఒకే ఎన్నికలు” ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పట్లో..ఎన్డీఏ పక్షాలు ఆమోదం తెలిపాయి. విపక్షాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు మళ్లీ అభిప్రాయసేకరణకు కేంద్రం సిద్ధమయింది. మరి నోట్ల రద్దు అని నిర్ణయం తీసుకుని అప్పట్లో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన మోడీ సర్కార్ ఇప్పుడు ఈ నిర్ణయంతో దేశంలో ఏ సంచలనం సృష్టిస్తారోనని కామెంట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top