చంద్రబాబు కి తలనొప్పిగా మారిన పార్టీలో ఉన్న కాపు నేతలు..!

Written By Xappie Desk | Updated: June 21, 2019 10:16 IST
చంద్రబాబు కి తలనొప్పిగా మారిన పార్టీలో ఉన్న కాపు నేతలు..!

చంద్రబాబు కి తలనొప్పిగా మారిన పార్టీలో ఉన్న కాపు నేతలు..!
 
2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేని ఓటమి రావడంతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలని తలమునకలవుతున్నారు. ఇటువంటి సమయంలో పార్టీలో ఉన్న కాపు నేతలు ఇప్పుడు చంద్రబాబు కి మరింతగా తల నొప్పి గా మారారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన కాపు నేతలు ప్రత్యేకంగా సమావేశం అవడం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది.
 
వారిలో అత్యదికులు టిడిపి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆద్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. వీరు కూడా బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. జ్యోతుల నెహ్రూ, బోండా ఉమామహేశ్వరరావు, పంచకర్ల రమేష్ బాబు,ఈలి నాని, వరుపుల రాజా , మీసాల గీత, కె.ఎ. నాయుడు తదితర మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను ఎదుర్కోవడం కష్టం కనుక బిజెపిలోకి వెళ్లడం బెటర్ అని వీరు భావిస్తున్నారు. కాగ ఎపి బిజెపి అద్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నందున, కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడం ద్వారా ఎపిలో బిజెపి ఎదగాలన్నది ఆ పార్టీ నేతల వ్యూహంగా ఉందని చెబుతున్నారు.
Top