యూరప్ పర్యటన కు వెళుతూ పార్టీ నేతలకు సీరియస్ ఆదేశాలు జారీ చేసిన బాబు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇటీవల మొదటి అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో కుటుంబ సమేతంగా యూరప్ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీరియస్ ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని పార్టీ నేతలకు సూచించారు.
ఆయన యూరప్ వెళుతూ పార్టీ నేతలకు కొన్ని జాగ్రత్తలు చెప్పారని సమాచారం వచ్చింది.అందులో కూడా టిడిపి కార్యకర్తలపై దాడులు అటూ ప్రస్తావించడం విశేషం. కార్యకర్తలపై దాడులు జరిగిన ప్రాంతాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొన్ని బృందాలుగా ఏర్పడి వెళ్లాలని చంద్రబాబు చెప్పారు. శాసనమండలిలో తెదేపా పక్ష నేత యనమల రామకృష్ణుడు, ఉభయ సభల్లోని పార్టీ ఉపనాయకులు ఈ బృందాలకు సారథ్యం వహించాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఆయా జిల్లాల నాయకుల్ని వెంట తీసుకెళ్లి ఎస్పీలను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు. తిరిగి చంద్రబాబు ఈ నెల 24వ తేదీన స్వదేశానికి చేరుకోనున్నట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.