గంపగుత్తగా బిజెపి పార్టీ లోకి వెళ్తున్నా టీడీపీ నేతలు..!

Written By Xappie Desk | Updated: June 21, 2019 10:29 IST
గంపగుత్తగా బిజెపి పార్టీ లోకి వెళ్తున్నా టీడీపీ నేతలు..!

గంపగుత్తగా బిజెపి పార్టీ లోకి వెళ్తున్నా టీడీపీ నేతలు..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనివిధంగా దారుణంగా ఓటమి పాలవడంతో ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు గంపగుత్తగా ఇప్పుడు బిజెపి పార్టీలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గ్రామంలో ఏపీ టీడీపీకి చెందిన కీలక రాజ్యసభ సభ్యులు ఇప్పటికే బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిడిపికి చెందిన నేతలు బిజెపి పార్టీలోకి కావాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు పంపుతున్నారు అంటూ వైసిపి పార్టీ ఆరోపిస్తోంది.
 
అయినా రాజీనామాలు చేయించకుండా ఈ ఎమ్.పిలను బిజెపిలోకి చేర్చుకోరాదని సూచించింది. పార్టీ ప్రదాన కార్యదర్శి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబు తనకు సన్నిహితులైన ఎమ్.పి లను బిజెపిలోకి పంపారని,ఇదంతా తనపై కేసులు రాకుండా జాగ్రత్తపడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో సన్నిహితుడైన నామా నాగేశ్వరరావును టిఆర్ఎస్ లోకి పంపించారని ఆయన అన్నారు. ఓటు కు నోటు కేసు సమయంలో కూడా చంద్రబాబు పలు రకాలుగా ప్రయత్నాలు చేసిన సందర్భం గుర్తుంచుకోవాలని రామచంద్రయ్య అన్నారు. సుజాన చౌదరిపై వేల కోట్ల రుణాల ఎగవేత ఆరోపణలు వచ్చాయని ఆయన అన్నారు. బిజెపిని తీవ్రంగా దూషించినవారిని కూడా పార్టీలో చేర్చుకున్నారని అన్నారు.విలువలు పాటించాలని కోరుతున్నామని, రాజీనామాలు చేయించి బిజెపిలో చేర్చుకోవాలని రామచంద్రయ్య అన్నారు.




Top