బిజెపిలో చేరిన చంద్రబాబుతో టచ్ లోనే ఉంటా సుజనా చౌదరి..!

Written By Xappie Desk | Updated: June 22, 2019 10:10 IST
బిజెపిలో చేరిన చంద్రబాబుతో టచ్ లోనే ఉంటా సుజనా చౌదరి..!

బిజెపిలో చేరిన చంద్రబాబుతో టచ్ లోనే ఉంటా సుజనా చౌదరి..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఎన్నడు లేని విధంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీలో ఉన్న నేతలకు అభద్రతా భావం ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లినా, తాను టచ్ లోనే ఉన్నానని, సంప్రదింపులు జరిపానని టిడిపి నుంచి బిజెపిలో చేరిన ఎమ్.పి సుజనా చౌదరి చెప్పారు.
 
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. చంద్రబాబు విదేశాలలో ఉన్నా టచ్ లోనే తాను ఉన్నానని చెప్పడం విశేషం. చంద్రబాబు కష్టపడే మనిషి, గొప్ప వ్యక్తి అని పొగుడుతూనే ఆయనను కొందరు తప్పుదారి పట్టించారని ఆయన అన్నారు. మునిగిపోయ టైటానిక్ నావలో ఎవరైనా ఉండాలని అనుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. తాను క్రియాశీల రాజకీయాలలో ఉండాలని బావిస్తున్నానని, అందుకే బిజెపిలో చేరానని ఆయన అన్నారు. తాను కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని వ్యక్తినని ఆయన చెప్పారు.
Top