కోవర్టులు అయితే విషయం వేరేలా ఉంటుంది అంటున్న బిజెపి నేతలు..!

Written By Xappie Desk | Updated: June 22, 2019 10:18 IST
కోవర్టులు అయితే విషయం వేరేలా ఉంటుంది అంటున్న బిజెపి నేతలు..!

కోవర్టులు అయితే విషయం వేరేలా ఉంటుంది అంటున్న బిజెపి నేతలు..!
 
ఇటీవల ఏపీ టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యులు బిజెపి పార్టీలో చేరడంతో ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కనుమరుగయ్యే రోజులు దగ్గరపడ్డాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
 
దీంతో ఎపిలో తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తు లేదని బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు చెప్పారు. టిడిపి మనుగడ కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. కేసులు ఉన్న ఎమ్.పిలను కూడా ఎలా చేర్చుకున్నారు అన్న విమర్శలకు ఆయన బదులు చెబుతూ, బీజేపీలో చేరే వారికి కేసుల నుంచి రక్షణ లభించదని చెప్పారు. ఎవరి కేసులు వారే వ్యక్తిగతంగా ఎదుర్కోక తప్పదన్నారు. చట్టప్రకారమే టీడీపీ రాజ్యసభపక్షం విలీనం అయ్యిందని వెల్లడించారు. కోవర్టు ఆపరేషన్లు కోసం వస్తోన్న వారిపై నిఘా ఉంటుందని విషయం వేరేలా ఉంటుంది అని జివిఎల్ అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని నలుగురిని మంత్రులు చేసిన టీడీపీకి మా గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంటుందని ఆయన అన్నారు.
Top