జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విజయవాడలో పార్టీ కార్యాలయంలో భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలను నేరుగా కలుసుకోవడానికి పార్టీ తరఫున కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకోసం కొన్ని రాష్ట్ర స్థాయి కమిటీలు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. టిడిపిలో ఉన్న తప్పుల్ని వెతకడానికి కొంత సమయం తీసుకున్నామని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు కూడా కొంత సమయం ఇస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కదిద్దాల్సిన అంశాలు చాలా ఉన్నాయని పవన్ అన్నారు. జనసేన పార్టీ ఉన్నదే సమస్యల పరిష్కారం కోసమని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టామన్నారు. ముందు రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న చాలా మంది కార్యకర్తలను కలవాలని నిర్ణయించానని చెప్పారు. ఎన్నికల్లో పొత్తు గురించి భవిష్యత్‌లో నిర్ణయాలు ఉంటాయని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాము ఒంటరిగానే వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు.