ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

Written By Xappie Desk | Updated: June 25, 2019 14:46 IST
ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఉన్న పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీకి రావలసిన ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేదని చూస్తూ ఊరుకునే రకం కాదు ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అంటూ అధికారంలో ఉన్న పార్టీ పై పరోక్షంగా పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా తనదైన శైలిలో స్పందించాడు… “తెలంగాణ సాధించుకోవాలని అక్కడి ప్రజలకు ఉన్నంత ఆకాంక్ష, కోపం.. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రా ప్రజలకు ఉందా లేదా? అని ఒక్కోసారి తనకు సందేహం కలుగుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల నుంచి రావాల్సినంత నిరసన రానప్పుడు ఎంత బలమైన పోరాటం చేసినా ఉపయోగం లేదన్నారు”. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన భవనాలను ఇటీవల వైసీపీ పార్టీ తిరిగి తెలంగాణకు అప్పగించడంపై కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీనిపై ప్రజలకు వైసీపీ పార్టీ వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Top