ప్రజా వేదికను కూల్చేద్దాం కలెక్టర్ సభలో ఘాటైన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..!

Written By Xappie Desk | Updated: June 25, 2019 14:46 IST
ప్రజా వేదికను కూల్చేద్దాం కలెక్టర్ సభలో ఘాటైన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్ పాలనలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా తీసుకుంటున్న నిర్ణయాల లో గతంలో ఏ ముఖ్యమంత్రి ఎవరు తీసుకొని విధంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు సీనియర్ రాజకీయ నేతలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చేయాలని జగన్ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు ఉన్న సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా జరిగిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ... నిబంధనలను రూల్స్ ను పాటించాల్సిన ప్రభుత్వమే పాటించకపోతే ఇక సామాన్యులు ఏం పాటిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఈ ప్రజా వేదిక లో ఇక్కడ జరిగే కలెక్టర్ ల ఆఖరి సమావేశం అని ఆయన అన్నారు. అందుకే జిల్లా కలెక్టర్లు, సెక్రటరీలు, మంత్రులు అందరిని ఇక్కడకు రమ్మన్నానని జగన్ పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి మనమే నిర్మాణాలు చేస్తే ఏమి చేయాలని అన్నారు. సామాన్యుడు ఎవరైనా అక్రమ నిర్మాణం చేస్తే ఊరుకుంటారా అని ఆయన అన్నారు. ఈ విషయాలను ప్రశ్నించడానికే తాను ఈ సమావేశం ఇక్కడ పెట్టానని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో అనేక చట్ట ఉల్లంఘనలు జరిగాయని, ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలను కొన్నారని, నలుగురిని మంత్రులు చేశారని, వాళ్లకు కలెక్టర్ లపై పెత్తనం అప్పగించారని ఆయన అన్నారు. అలాంటప్పుడు ఎన్నికలు ఎలా ఫెయిర్ గా ఉంటాయని సీఎం జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Top