ప్రైవేటు స్కూల్ ఫీజుల విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

By Xappie Desk, June 25, 2019 14:47 IST

ప్రైవేటు స్కూల్ ఫీజుల విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

ఇటీవల కలెక్టర్లు మంత్రులు అధికారుల సమావేశంలో పాల్గొన్న జగన్ తన మొట్ట మొదటి ప్రాధాన్యత రైతుల తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చదువు విషయంలో సామాన్యులకు పేదవాళ్లకు న్యాయం చేసేలా ప్రైవేటు స్కూల్ ఫీజుల విషయంలో నియంత్రణకు త్వరలో శాసనసభలో కొత్త చట్టం తీసుకు రాబోతున్నట్లు జగన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేటు స్కూల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదని జగన్‌ అన్నారు. జనవరి 26 నుంచి ‘అమ్మఒడి’ చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు తప్పనిసరిగా గుర్తింపు ఉండడంతో పాటు కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో ఉపాధ్యాయులు కూడా ఉండాలని సీఎం అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని జగన్‌ వివరించారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని.. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తామన్నారు. తాజాగా సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు సరైన సీఎం ఆంధ్ర ప్రజలు ఎన్నుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.Top