జనసేన పార్టీ వైపు చూస్తున్న వంగవీటి రాధాకృష్ణ..?

By Xappie Desk, June 25, 2019 14:48 IST

జనసేన పార్టీ వైపు చూస్తున్న వంగవీటి రాధాకృష్ణ..?

కాపు సామాజిక వర్గంలో కీలక నేత అయిన వంగవీటి రాధాకృష్ణ గతంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. గతంలో జగన్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో వైసిపి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో టిడిపి పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అయితే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో... తెలుగుదేశం పార్టీ మనుగడ కూడా లేకపోవడంతో వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీ వైపు చూస్తున్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో టాక్ వినపడుతోంది. ఇందుమూలంగానే ఇటీవల పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు ముందు వంగవీటి రాధాకృష్ణ అనూహ్యంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో అనేక మంది అది సరైన నిర్ణయం కాదని చెప్పినా, ఆయన వినకుండా టిడిపిలో చేరి చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేశారు. టిడిపి ఓడిపోవడంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో తాజాగా ఆయన జనసేనలోకి వెళ్లలాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇది కూడా ఆసక్తికకరమైన విషయమే. జనసేన పరిస్థితి కూడా బాగోలేదు. అయినా జనసేన పార్టీలో చేరితే విశేషమే అవుతుంది.Top