బాలకృష్ణ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన పురంధేశ్వరి..!

Written By Xappie Desk | Updated: June 26, 2019 14:00 IST
బాలకృష్ణ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన పురంధేశ్వరి..!

బాలకృష్ణ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన పురంధేశ్వరి..!
 
ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పురందేశ్వరి టీడీపీకి చెందిన నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పామర్రు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువు పొట్లూరి కృష్ణ బాబును బీజేపీ లోకి ఆహ్వానించి బాలకృష్ణ కి ఝలక్ ఇచ్చారు పురందేశ్వరి. గతంలో పొట్లూరి కృష్ణబాబు తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండేవారు పైగా ఎమ్మెల్యే బాలకృష్ణ కి దగ్గర బంధువు కూడా. ఇటువంటి క్రమంలో పొట్లూరి కృష్ణబాబు భార్యతో సహా బిజెపి పార్టీలో చేరడం ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి చెందడంతో ఆ పార్టీలో ఉన్న చాలామంది నేతలు బిజెపి పార్టీ లోకి వెళుతున్న క్రమంలో టిడిపిలో ఉన్న పెద్ద పెద్ద తలకాయలు ఏం చేయలేని స్థితిలో కి వెళ్ళిపోయారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపి పార్టీలోకి వెళ్లిన క్రమంలో తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉండే అంబికా దర్బార్ బత్తి యజమాని అంబికా కృష్ణ సైతం బీజేపీ పార్టీలోకి వెళ్లడంతో ఏపీ టీడీపీ నేతలకు భయం పట్టుకుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎలాగైనా తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు జాతీయ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.
Top