జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పురందేశ్వరి…!

Written By Xappie Desk | Updated: June 28, 2019 10:00 IST
జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పురందేశ్వరి…!

జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పురందేశ్వరి…!
 
ఏపీ బీజేపీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పురందేశ్వరి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశం ముగిసిన అధ్యాయమని కేంద్రం ఇచ్చే నిధులతో సరిపెట్టుకోవాలని అనవసరంగా జగన్ ప్రత్యేక హోదాపై అసలు పెట్టుకోకూడదని పేర్కొన్నారు.
 
గతంలో చంద్రబాబు చేసిన పొరపాటును జగన్ చేయవద్దని పురందేశ్వరి సూచించారు. అంతేకాకుండా ఇటీవల జగన్ ప్రభుత్వం కృష్ణానది పక్కన నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు కట్టించిన ప్రజావేదిక ను కూల్చేయడం తప్పు అని ఖండించారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సీఎం జగన్ వ్యవహరించకూడదని పేర్కొన్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ సన్నాహక సమావేశంలో పాల్గొన్న పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.
Top