భీమవరం, గాజువాక నియోజకవర్గాలకు సంబంధించి షాకింగ్ నిర్ణయం తీసుకున్న పవన్…!
2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలలో భీమవరం గాజువాక నియోజకవర్గాల నుండి జనసేన పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోవడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. చాలామంది పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాలలో గెలుస్తారని కచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారని అనుకున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ కి మతిపోయే విధంగా ఓటుతో బుద్ధి చెప్పడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ నేతలు షాక్ తిన్నారు. ఇదిలా ఉండగా ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై చిన్న చిన్నగా విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాలకు సంబంధించిన ఓ విషయంపై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ రెండు నియోజకవర్గాలలో జనసేన పార్టీ కార్యకర్తలను ఇతర పార్టీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారన్నా విషయం పవన్ దృష్టికి వచ్చిందని అందువల్ల ఆ రెండు చోట్ల సహా అనంతపురం జిల్లాలో కూడా తన ప్రధాన కార్యాలయాలను ప్రారంభించి జూలై రెండవ వారం నుంచి చేపట్టనున్న సమీక్షా సమావేశాల ద్వారా వారితో మాట్లాడనున్నారట. ఇదే విధానాన్ని పవన్ కళ్యాణ్ ప్రతి జిల్లాలోనూ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం.