Advertisement

గంటా కు దిమ్మతిరిగే షాక్..!

by Xappie Desk | June 29, 2019 17:51 IST
గంటా కు దిమ్మతిరిగే షాక్..!

గంటా కు దిమ్మతిరిగే షాక్..!
 
గతంలో అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా పరిపాలించిన చంద్రబాబు విధానాలపై దోచుకున్న వాటిపై అక్రమంగా కట్టిన భవనాలపై ప్రత్యేకమైన దృష్టి సారించారు ఏపీ నూతన సీఎం జగన్. విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో ఇష్టానుసారంగా బలాదూర్ ఖర్చులు ఖర్చుపెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసిన చంద్రబాబు తీరుపై జగన్... ప్రజలకు అర్థమయ్యే రీతిలో అన్ని విషయాలను బయట పెట్టడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు జగన్. ఈ సందర్భంగా ముందుగా రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం... చంద్రబాబు కృష్ణా నది తీరాన నిబంధనలకు విరుద్ధంగా కరకట్టల దగ్గర కట్టిన ప్రజా వేదికను కూల్చిన విషయం మనకందరికీ తెలిసినదే. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉంటే గంటా శ్రీనివాసరావు కి కూడా జగన్ ప్రభుత్వం ఇస్తున్నట్లు సమాచారం. గతంలోనే గంటా మంత్రిగా ఉన్నపుడు భీమిలిలో భూ ఖబ్జాల విషయంలో జగన్ చెయ్యాల్సిన పని చేస్తారని అంతా అనుకుంటుండగా ఇప్పుడు అదే భీమిలీలోని గంటా నిర్మించుకున్న క్యాంప్ కార్యాలయం కూడా జగన్ కూల్చేయనున్నారని ఇప్పుడు అందుతున్న సమాచారం. దీన్ని బట్టి జగన్ గంటాను అస్సలు విడిచిపెట్టేలా లేరని చెప్పాలి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది కీలక నేతలు గత ప్రభుత్వ హాయంలో ఇష్టానుసారంగా కట్టిన అక్రమకట్టడాల లిస్ట్ కూడా ఏపీ ప్రభుత్వం చేతిలో ఉన్నట్లు త్వరలోనే వాటి పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు అని ఏపీ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.


Advertisement


Advertisement

Top