పార్లమెంటులో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 22 ఎంపీ స్థానాలను గెలిచి పార్లమెంటులో అత్యధిక ఎంపీలను కలిగిన నాలుగోవ పార్టీగా వైసిపి పార్టీ విశిష్టత దక్కించుకుంది. ఈ సందర్భంగా కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి విషయంలోనూ ఎక్కడా కూడా వైసిపి పార్టీ కాంప్రమైజ్ కాకుండా పోరాట పటిమ తోనే అధ్యక్షుడు జగన్ మాదిరిగా పార్లమెంటులో వైసిపి పార్లమెంటు సభ్యుడు పోరాడుతున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో వైసీపీ ఎంపీ ప్రధాని మోడీ కి షాక్ ఇచ్చారు. విషయంలోకి వెళితే నిండు సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రఘురామ కృష్ణంరాజు ఒక ప్రశ్నను అడుగుతున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీ సభ నుంచి బయటకు వెళుతున్నారు. అది చూసిన రఘురామ కృష్ణంరాజు తాను ప్రశ్న అడిగే సమయంలో ప్రధాని సభలో ఉండాలని మోడీజీ అంటూ పేరు పెట్టి పిలిచి చేతులు జోడించి అడిగారు. అయితే మోదీ ఆశ్చర్యపోయి మీరు ప్రశ్న అడగండి అని చెబుతూనే, పట్టించుకోకుండా సభ నుంచి బయటకు వెళ్లారు. ఇక ప్రధాని వెంట రైల్వే, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తో సహా పలువురు సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. అయితే మోదీ గారు ప్రశ్న వినకుండానే ఆయన ఎటూ వెళ్లిపోయారుగా అంటూ తన ప్రశ్నను కేంద్రమంత్రికి సంధించారు. మొత్తం మీద ధైర్యంగా రఘురామకృష్ణంరాజు ప్రధానిని ఆపడంతో చాలామంది పార్లమెంట్ లో ఉన్న సీనియర్లు సైతం షాక్ తిన్నారు.