సోషల్ మీడియాలో దేవినేని ఉమా పై సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి..!
వైసీపీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే మీడియా పై విమర్శల వర్షం కురిపించారు. సోషల్ మీడియా సాక్షిగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ఆయన భజన చేసే మీడియా చానళ్లపై ఇటీవల ఏపీ ప్రభుత్వం అక్రమంగా కట్టిన భవనాలపై తీసుకున్న చర్యలపై చేస్తున్న కథనాలను ఉద్దేశించి విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు. నదీ పరిరక్షణ చట్టం-1884, ఎన్జీటీ, సీఆర్డీఏ నిబంధనలు నదిని పూడ్చి నిర్మించిన కట్టడాలు అక్రమమని ఘోషిస్తున్నాయి. మీడియా కూడా ఈ చట్టాలు చదవాలి. బాబు నిర్మించాడు కాబట్టి కుల మీడియాకు అవి చారిత్రక కట్టడాల్లా కనిపిస్తున్నాయేమో. చంద్రబాబు ప్రభుత్వం 9 కోట్లు బొక్కి నిర్మించిన ప్రజావేదిక నాణ్యతపై సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు సర్క్యులేట్ అవుతున్నాయి. గణేశ్ మండపానికి ఎక్కువ, కోళ్ల షెడ్డుకు తక్కువని సోషల్ మీడియాలో యువత చలోక్తులు విసురుతోంది. దాన్నికూల్చడం అనొద్దట. ఏ రేకుకు ఆ రేకు విప్పారని అనాలట. ఉత్తర కుమారుడు ఎలా ఉంటాడో నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఉమా! 2018 జూన్‌కల్లా పోలవరంలో నీళ్ళు నిలబెడతాం. రాసుకో సాక్షి పేపర్లో అని ప్రగల్భాలు పలికినప్పుడే ఆ పేరు నీకు స్థిరపడింది. నీ అవినీతి పుట్ట పగిలే టైం వచ్చింది కాస్త ఓపిక పట్టు...అంటూ సెటైర్లు వేస్తూ దేవినేని ఉమ కి చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.