జగన్ కి ఎవరు చెప్పక్కర్లేదు అంటున్న విజయసాయిరెడ్డి..!

జగన్ కి ఎవరు చెప్పక్కర్లేదు అంటున్న విజయసాయిరెడ్డి..!

వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో జగన్ కి ఎవరు చెప్పక్కర్లేదు అంటూ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ యుద్ధం ఎప్పుడు చేయాలో సామరస్యంగా ఎప్పుడు ఉండాలో జగన్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదని ట్విటర్ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారంటే ప్రజా సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి విలువైన సూచనలేమైనా చేస్తారనుకున్నాం. కానీ ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి నోటీసులివ్వడం పైనా, నారావారిపల్లెలోని భవనానికి కాపలా తగ్గించడం పైన సంతాప తీర్మానాలు చేశారు. అంటే మీ సమస్యే ప్రజా సమస్యా? కేశినాని గారూ ఇకనైనా మారండి. మీ అధినేత బిజెపిని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి. యూ-టర్ను తీసుకుని కాంగ్రెస్ గుంపులో చేరితే అది గొప్ప నిర్ణయమనాలి. తెలంగాణ సీఎంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తే మేమూ అదే చేయాలా? యుద్ధం ఎప్పుడు చేయాలో, సామరస్యంగా ఎప్పుడు మెలగాలో మా సీఎం గారికి తెలుసు. బహుదా-వంశధార-నాగావళి లింక్‌ పనులను ఐదేళ్లలో మీరెందుకు పూర్తి చేయలేక పోయారు ఉమా? వనరుల దోపిడీకి తప్ప ఉత్తరాంధ్రను మీరు పట్టించుకున్నదెపుడు? ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3,500 టిఎంసీల గోదావరి నీటితో ప్రతి ఎకరాకు జలాభిషేకం చేస్తారు సీఎం జగన్ గారు.Top