అన్ని ఆధారాలు ఉన్నాయి, టీడీపీ అవినీతి బయటపెడతామంటున్న ఏపీ మంత్రులు…

Written By Anoop Sai Bandi | Updated: July 01, 2019 11:09 IST
అన్ని ఆధారాలు ఉన్నాయి, టీడీపీ అవినీతి బయటపెడతామంటున్న ఏపీ మంత్రులు…

గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందని పేర్కొంటూ అన్ని విషయాలు బయట పెడతాం అంటున్నారు ఏపీ మంత్రులు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని అమరావతి నిర్మాణం, మైనింగ్ లీజులు, పుష్కరాలు సహా పలు అంశాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని ఎపి మంత్రులు బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, కన్నబాబు లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడటమే తమ లక్ష్యమని, సీఎం నిర్దేశించిన 45 రోజుల్లో సమీక్ష పూర్తి చేసి గడువులో అవినీతిపై నివేదిక అందిస్తామని తెలిపారు. పోలవరం, సీఆర్‌డీఏ, మైనింగ్ లీజులు, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రారంభించిన పథకాలను సమీక్షించనున్నట్లు మంత్రులు తెలిపారు. రాజధాని అమరావతి, విశాఖ భూ కుంభకోణం సహా పలు భూ కేటాయంపులపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ప్రతి 5 రోజులకు ఒకసారి సబ్ కమిటీ భేటీ అవుతుందని.. 15 రోజులకోసారి సీఎంతో సమావేశమవుతుందని మంత్రులు తెలిపారు.
Top