పవన్ కళ్యాణ్ కొత్త స్ట్రాటజీ..!

పవన్ కళ్యాణ్ కొత్త స్ట్రాటజీ..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని రీతిలో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో...జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు నిరుత్సాహం చెందుతున్న సమయంలో ఓటమిని తాను లెక్క చేయను మార్పుకోసమే రాజకీయాల్లోకి వచ్చానని చచ్చిపోయే అంత వరకు ప్రజా పోరాటం చేస్తానని పార్టీ నాయకులను కార్యకర్తలను ఇటీవల బలపరిచారు. ఇదిలా ఉండగా తాజాగా ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ వెరైటీగా కొత్త స్ట్రాటజీ వేసినట్టు సమాచారం. పశ్చిమ గోదావరి పాలకొల్లు అంటే మెగా ఫ్యామిలీ కి అత్యంత దగ్గరగా ఉండే ఊరు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇక్కడి నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరిలో తనకంటూ ఇమేజ్ వుండేలా సరికొత్త కార్యక్రమం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో చేసేదేమీ లేదని భావించారో కానీ.. జనసేన నేతృత్వంలో పాలకొల్లులో ఫిలిం ఇన్ స్టిట్యూట్ ప్రారంభించనున్నట్లు జనసేన ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. అల్లు రామలింగయ్య..దాసరి నారాయణ.. కోడి రామకృష్ణ లాంటి ఉద్దండులను సినీ రంగానికి అందించిన ఘనత పాలకొల్లుకు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ ఇన్ స్టిట్యూట్ ను రాజా వన్నెంరెడ్డి.. బన్నీ వాసులు నిర్వహిస్తారని చెబుతున్నారు. ఈ ఇన్ స్టిట్యూట్ కి హరిరామజోగయ్య ఛైర్మన్ గా.. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తారని చెబుతున్నారు. నటన.. దర్శకత్వంతో పాటు పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇన్ స్టిట్యూట్ సిద్ధంగా ఉందట.



Top