రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు దేశ ప్రజలకు కొత్త పిలుపునిచ్చిన మోడీ…!

Written By Anoop Sai Bandi | Updated: July 01, 2019 11:13 IST
రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు దేశ ప్రజలకు కొత్త పిలుపునిచ్చిన మోడీ…!

దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 2014 కంటే ఎక్కువ స్థానాలు గెలిచి అందరికి షాక్ ఇచ్చారు మోడీ. 2014 ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం చేపట్టారు. దేశం మొత్తం పరిశుభ్రంగా ఉండాలని ప్రజలంతా పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. అయితే ఈసారి రెండో సారి ఎన్నికల్లో గెలిచాక మొట్టమొదటిసారి ప్రధాని మోడీ మాన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ...నీటి ప్రాధాన్యత గురించి.. దాని అవసరం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నీటి సమస్యను ప్రస్తావించిన మోడీ.. జలసంరక్షణకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పిన ఆయన.. నీటి పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని పెద్దల్ని.. ప్రముఖుల్ని కోరారు. జల సంరక్షణ కోసం పని చేసే ఎన్జీవోలు.. వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే.. వారి వివరాల్ని అందరికి తెలిసేలా అప్ లోడ్ చేయాలన్నారు. జలసంరక్షణ కోసం సంబంధించిన ఏ అంశాన్ని అయినా హ్యాష్ టాగ్ జన్ శక్తి ఫర్ జల్ శక్తికి అప్ లోడ్ చేయాలన్న సూచన చేశారు. మరి.. మోడీ పిలుపునకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Top