పోలీసులను పరిగెత్తించి చితక్కొట్టిన ఎమ్మెల్యే తమ్ముడు…!

Written By Anoop Sai Bandi | Updated: July 01, 2019 11:14 IST
పోలీసులను పరిగెత్తించి చితక్కొట్టిన ఎమ్మెల్యే తమ్ముడు…!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్న ట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఏకంగా ప్రజలను రక్షించే పోలీసులపై దాడులకు పాల్పడడం ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఇటువంటి దాడులు జరిగినా పెద్దగా టిఆర్ఎస్ అధిష్టానం స్పందించకపోవడాన్ని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు తప్పు పడుతున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడు ఒకరు అటవీ శాఖ అధికారిని పై భౌతికంగా దారుణంగా దాడి చేయటం జరిగింది. వివరాల్లోకి వెళితే కుమురుం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్‌సాలా గ్రామం సమీపంలో హరిత హారం పనుల్లో భాగంగా అటవీ శాఖకు చెందిన భూమిని చదును చేయడానికి ఎఫ్‌ఆర్వో చోలే అనిత తన సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. అంతే ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు కొందరు రైతుల్ని అక్కడకు తీసుకొచ్చి గొడవకు దిగాడు. పోలీసులు శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని చూసినా కృష్ణారావు మాత్రం కర్రతో పరిగెత్తించి ఎఫ్‌ఆర్వో చోలే అనితపై దాడిచేయడంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో అధికారంలో ఉన్న నేతలు పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు పోలీస్ శాఖ అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Top