పోలవరం ప్రాజెక్టు గురించి షాకింగ్ వార్త చెప్పిన జగన్..!

Written By Xappie Desk | Updated: July 20, 2019 14:00 IST
పోలవరం ప్రాజెక్టు గురించి షాకింగ్ వార్త చెప్పిన జగన్..!

పోలవరం ప్రాజెక్టు గురించి షాకింగ్ వార్త చెప్పిన జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు నువ్వానేనా అన్నట్టుగా తారాస్థాయికి చేరుకుంటున్న క్రమంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి గురవటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో వెంటనే లీడర్ ఆఫ్ ది హౌస్ మరియు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి షాకింగ్ వార్త తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు పై క్లారిటీ విష్ణు మాట్లాడిన ఏపీ సీఎం జగన్.. జూన్ నుంచి అక్టోబర్ వరకు గోదావరిలో వరదలు వస్తాయని తెలిపారు.
 
అయితే టీడీపీ ప్రభుత్వం స్పీల్‌వేను పక్కనబెట్టి.. కాపర్ డ్యాం నిర్మాణానికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని జగన్ గుర్తు చేశారు. నవంబర్‌లో పనులు ప్రారంభించి 2021 జూన్ నాటికి నీళ్లిస్తామని జగన్ స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ వల్ల దాదాపు 15 శాతం వరకు నిధులు మిగులుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. సబ్ కాంట్రాక్ట్‌ల ముసుగులో బంధువులు, అనుచరులకు పనులు కట్టబెట్టారని.. యనమల వియ్యంకుడికి సబ్‌కాంట్రాక్ట్ ఇచ్చారని, కానీ ఇంతవరకు పనులు మొదలు కాలేదని జగన్ ఎద్దేవా చేశారు. ఏం జరగకుండానే రూ.724 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారని జగన్ ఆరోపించారు. నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత 15, 20 రోజుల్లో అన్నీ బయటకు తీస్తామని జగన్ వెల్లడించారు.
Top