పార్టీ పెట్టొద్దని మా ఫ్యామిలీ కల్యాణ్ కి ఎంతో చెప్పాం కానీ....?

పార్టీ పెట్టొద్దని మా ఫ్యామిలీ కల్యాణ్ కి ఎంతో చెప్పాం కానీ....?

పార్టీ పెట్టొద్దని మా ఫ్యామిలీ కల్యాణ్ కి ఎంతో చెప్పాం కానీ....?
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆయన అన్నయ్య నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నడిచిన సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు ఇటీవల జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా పవన్ కళ్యాణ్ తనని నియమించడం బాధ్యతలు ఇవ్వడం పట్ల నాగబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం కొత్తగా జనసేన పార్టీ పెట్టడం మెగా ఫ్యామిలీ కి ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ చేదు అనుభవాలు చూసి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడాన్ని మెగా కుటుంబం అంగీకరించలేదని తెలిపారు. పార్టీ పెట్టి తన తమ్ముడు ఎందుకు కష్టపడాలి అని తామంతా ఆలోచించామని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. తన సోదరుడు చిరంజీవి ఎంత ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసనని అందువల్లే తాను ఆ ఇబ్బందులు తన తమ్ముడు పవన్ కు అవసరం లేదని ఆలోచించామని పేర్కొన్నారు. అందువల్లే ఫ్యామిలీ అంతా పవన్ పార్టీపెట్టడంపై విముఖత చూపినట్లు తెలిపారు. కానీ మొండిగా ఉండే పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించే వ్యక్తిత్వమని నాగ బాబు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ తనకి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని నాగబాబు స్పష్టం చేశారు.Top