వైసీపీలోకి బోండా ఉమ ఎంట్రీ కన్ఫార్మ్…!

Written By Aravind Peesapati | Updated: August 03, 2019 17:50 IST
వైసీపీలోకి బోండా ఉమ ఎంట్రీ కన్ఫార్మ్…!

వైసీపీలోకి బోండా ఉమ ఎంట్రీ కన్ఫార్మ్…!
 
తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తాజాగా కొన్ని రోజుల నుండి పార్టీ మారుతున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోరాతి ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న చాలామంది నేతలు బిజెపి పార్టీలో చేరిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా కి కూడా సరైన గౌరవం ఇటీవల దక్కకపోవడంతో ప్రస్తుత పరిణామాలను బట్టి పార్టీ మారడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయన బంగీ జంప్ చేస్తున్న వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. రాజకీయాల్లో తాను వేయబోతున్న సాహసమైన అడుగు ఇలా ఉంటుందంటూ విదేశాల్లో స్వయంగా బంగీ జంప్ చేసిన వీడియోను పోస్ట్ చేశారు. వీడియో, ఆయన చేసిన కామెంట్స్ తో బొండ ఉమా పార్టీ మారతారనే ప్రచారాన్ని ధ్రువీకరించినట్లైంది. రెండ్రోజుల్లో విదేశీ పర్యటన ముగించుకుని బొండ ఉమా విజయవాడకు వస్తారని అనుచరవర్గం చెబుతుంది. అయితే ప్రస్తుతం బోండా ఉమా మనసులో వైసీపీ పార్టీలో చేరడానికి ఎక్కువ చొరవ చూపుతున్నట్లు ఇందుకు సంబంధించి బెజవాడ కి చెందిన వైసిపి పార్టీ పెద్ద పెద్ద నాయకులతో మంతనాలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా వైసీపీలో బోండా ఉమా ఎంట్రీ కన్ఫర్మ్ అని ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది.
Top