పోలవరం ప్రాజెక్ట్ విషయంలో లోకేశ్ అడిగినవాటికి జగన్ నోట మటరాలేదు…!

Written By Aravind Peesapati | Updated: August 03, 2019 17:53 IST
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో లోకేశ్ అడిగినవాటికి జగన్ నోట మటరాలేదు…!

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో లోకేశ్ అడిగినవాటికి జగన్ నోట మటరాలేదు…!
 
ఏపీ జీవనాడి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు విషయమై రివర్స్ టెండర్లకు వెళతానంటున్న ఏపీ సీఎం జగన్ నీ నారా లోకేష్ సోషల్ మీడియాలో కడిగిపారేశారు. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ట్విట్టర్లో ఏమన్నారంటే..” తుగ్లక్ గారు ఉన్నారా? విన్నారా? పోలవరం టెండర్లు రద్దు చెయ్యడం బాధాకరం, మీ తుగ్లక్ చర్య వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ గారు లోక్ సభ లో చెప్పారు.. పోలవరం ప్రాజెక్టు లో 2600 కోట్ల అవినీతి జరిగిపోయింది అంటూ తల తిక్క లెక్కలు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది.పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ,కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరులశాఖ, సిడబ్ల్యుసి, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులు విడుదల చేస్తుంది. ఇన్ని కేంద్రవ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు కనిపించింది. రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరానికి టెండర్ పెట్టడమని అర్థమయింది”… అని పలు రకాల విమర్శలు చేశారు నారాలోకేష్. అయితే లోకేష్ చేసిన విమర్శలకు ఇప్పటివరకూ జగన్ నోటి నుండి గాని వైసీపీ పార్టీ నుండి గాని కౌంటర్ గా ఒక్క మాట బయటకు రాలేదు.
Top