ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైసీపీ పాలనలో లొసుగులు..!

ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైసీపీ పాలనలో లొసుగులు..!

ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైసీపీ పాలనలో లొసుగులు..!
 
భారీ మెజార్టీతో తనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకంతో జగన్ అవినీతి లేని పాలన రాష్ట్రంలో ఉన్న సామాన్యులకు ఇవ్వాలని క్రింద ఉన్న ప్రభుత్వ అధికారులను అలాగే పార్టీ తరపున గెలిచిన నాయకులకు సమావేశాలు పెట్టి చెప్పడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో జగన్ గత పాలన చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను వాటి పర్యవసానాలను ప్రజలపై పడకుండా నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంటే మరోపక్క కింది స్థాయిలో వైసిపి పార్టీ నాయకులు చేస్తున్న లొసుగులు... ఒక్కొక్కటిగా తాజాగా బయటపడుతున్నాయి. దీంతో ఓట్లు వేసిన జనాలు మరియు అభిమానులే కిందిస్థాయి నాయకులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ఏమో పైకి ఒకటి చెప్తుంటే కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం మరోటి జరుగుతుంది. జగన్ ఏమో అవినీతికి దారివ్వను అని నా ఎమ్మెల్యే తప్పు చేసినా దాన్ని వీడియో తీసి పంపించండి అని స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ అతను ఇచ్చిన గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల్లోనే భారీ అవకతవకలు జరుగుతున్నాయి. ఉద్యోగానికి అప్లై చేసిన వారికి కాకుండా స్థానిక ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఒక లిస్ట్ ప్రకారమే ఉద్యోగాలు కేటాయిస్తున్నారని సదరు వైసీపీ ఓటర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను అన్ని ప్రశ్నలకు సమాధానం సరైన సమాధానము చెప్పినా సరే ఉద్యోగం ఇవ్వలేదని ఇక్కడే అవినీతి జరుగుతుందని ఇంటర్వ్యూ కి వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Top