బీజేపీ దెబ్బకి కుదేలవుతున్న టీడీపీ.... మరో నేత బయటికి..!

Written By Aravind Peesapati | Updated: August 03, 2019 17:55 IST
బీజేపీ దెబ్బకి కుదేలవుతున్న టీడీపీ.... మరో నేత బయటికి..!

బీజేపీ దెబ్బకి కుదేలవుతున్న టీడీపీ.... మరో నేత బయటికి..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ అధినేత జగన్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీ కోలుకోలేని దెబ్బ కొట్టారు. దీంతో టీడీపీ కేవలం 23 స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితం కావడంతో పార్టీని ముందుకు తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరోపక్క పార్టీలో ఉన్న వచ్చే నేతలు ఇప్పటికే బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్న నేపథ్యంలో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇటువంటి నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ టీడీపీ నేత గంగుల ప్రతాప్ రెడ్డి కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన బిజెపి పార్టీ జాతీయ నాయకులను కలిసి చర్చించగా,కర్నూలు జిల్లాలో తగిన ప్రాధాన్యం ఇస్తామని, పార్టీ అభివృద్ధి కోసం పాటు పడాల్సిందిగా సూచించినట్లు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే రాయలసీమ ప్రాంతం ఇప్పటికే పట్టు మొత్తం కోల్పోయిన టిడిపి కి బిజెపి దెబ్బ తో కుదేల్ అవటం ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గంగుల ప్రతాప్ రెడ్డి మాత్రమే కాక ఇంకా చాలా మంది టీడీపీ లో ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీని విడిచి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Top