హోదా ఊసు లేనే లేదేమి జనసేనాని గారు?

Written By Aravind Peesapati | Updated: August 06, 2019 15:17 IST
హోదా ఊసు లేనే లేదేమి జనసేనాని గారు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో ఉన్న తన పార్టీకి చెందిన నాయకులతో జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు గురించి అలాగే పార్టీకి ఓటమికి గల కారణాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాన్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...హోదా కోసం తనకి ఉద్యమం చేయాలని ఉంది కానీ అది ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి బలంగా సపోర్ట్ వస్తేనే నేను కూడా ప్రత్యేక హోదా ఉద్యమం కోసం రంగంలోకి దిగుతానని భీమవరంలో జరిగిన సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు.విభ‌జ‌న త‌రువాత ఆంధ్రాకి అన్యాయం జ‌రిగింద‌నీ, కేంద్రం ఇస్తామ‌ని చెప్పిన ప్ర‌త్యేక హోదాను అడిగి తీసుకునే స్థాయిలో ఉన్న నాయ‌కులూ పోరాటాలు చేసిన పార్టీలే దానికి తూట్లు పొడిచాయ‌న్నారు. హోదా గురించి తానొక్క‌డినే మాట్లాడుతుంటే, అదేదో త‌న స‌ర‌దాలా ఉంద‌న్నారు! ప్ర‌జ‌ల్లో భావోద్వేగం లేన‌ప్పుడు, కోపం లేన‌ప్పుడు, ఆవేద‌న లేన‌ప్పుడు… లేని వాటిని ప్ర‌జ‌ల్లో క్రియేట్ చేయ‌లేమ‌న్నారు ప‌వ‌న్. పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం స‌మ‌యంలో మాట్లాడిన వైకాపా అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఇవాళ్ల హోదా గురించి గ‌ట్టిగా నిల‌బ‌డ‌లేక‌పోతున్నార‌న్నారు. మొత్తంమీద ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి లేనట్టుగానే మాట్లాడారు.
Top