వైసీపీలోకి జంప్ చేసిన తెదేపా యువ నేత!

Written By Aravind Peesapati | Updated: August 06, 2019 15:44 IST
వైసీపీలోకి జంప్ చేసిన తెదేపా యువ నేత!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ లోకి ఇతర పార్టీల నాయకుల రావటానికి తెగ ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధి తన పార్టీ లోకి రావాలంటే కచ్చితంగా రాజీనామా చేయాలని ప్రకటించడంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఆలోచనలో పడ్డారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా బెజవాడ రాజకీయాల్లో ఓ ప్రముఖ కుమారుడు యువనేత వైసిపి పార్టీ లోకి రావడానికి తెగ కష్టపడుతున్న సమాచారం. విషయంలోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత తనయుడు.. ఇప్పుడు వైసీపీలో చేరడానికి అంగీకారం తెలిపారని అంటున్నారు. ఆయన…వైఎస్ మరణం తర్వాత… జగన్‌తో పాటు నడవలేదు. కొన్నాళ్లు కాంగ్రెస్‌లోనే ఉండి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆయన కుమారుడు.. కృష్ణా జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా… ఫుల్ టైం రాజకీయనేతగా… కష్టపడతారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో.. ఆ యువనేతపై దృష్టి పెట్టిన … వైసీపీ.. తమ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ బాధ్యతలతో పాటు… పార్టీలోనూ తగినంత ప్రాధాన్యం ఇస్తామని … బేరం పెట్టడంతో.. యువనేత తన సన్నిహితులతో.. గత ఐదారు రోజులుగా చర్చలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Top