కంటతడి పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..!

Written By Aravind Peesapati | Updated: August 07, 2019 14:54 IST
కంటతడి పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..!

కంటతడి పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..!
 
బిజెపి పార్టీ మహిళా నేత మాజీ కేంద్ర మంత్రి సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ మరణ వార్త విని బిజెపి పార్టీ పెద్దలు మరియు దేశంలో ఉన్న చాలామంది ప్రముఖులు సంతాపం తెలిపారు. అంతే కాకుండా బిజెపి పార్టీకి విధేయులుగా ఉండే చాలా మంది నాయకులు తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యి సుష్మా స్వరాజ్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ లోలోపల కుమిలిపోతున్నారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ భౌతికకాయానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు.
 
ఆ తర్వాత వెంటనే ఆమె కుటుంబ సభ్యులను మోడీ పరామర్శించారు. మోడీ కూడా ఆమె కుటుంబ సభ్యుల దగ్గర తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గుండెలో ఉన్న బాధను దిగమింగుకుని కంటిలో వస్తున్న నీరును ప్రధాని మోడీకి కనిపించకుండా చేయాలని ప్రయత్నించినా గాని ఆ బాధ ఆ కన్నీరును ప్రధాని మోడీ లో నుండి బయటకు వచ్చేసాయి. ఎంత గంభీరంగా ఉండటానికి ప్రయత్నించినా ప్రధాని మోడీ కంటి వెంట నీరు ఆగలేదు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా, జేపీ నడ్డా, తదితరులు నివాళి అర్పించారు.
 
Top