వెంకయ్య నాయుడుతో భేటీ అయిన జగన్..!

వెంకయ్య నాయుడుతో భేటీ అయిన జగన్..!

వెంకయ్య నాయుడుతో భేటీ అయిన జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి విదేశ పర్యటన గా ఇశ్రాయేలు దేశం ఇటీవల కుటుంబ సమేతంగా వెళ్లి వచ్చారు ఏపీ సీఎం జగన్. అయితే ఈ క్రమంలో విదేశ పర్యటన ముగించుకుని ఇటీవల రాష్ట్రంలో అడుగు పెట్టిన జగన్ వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో జగన్ భేటీ అవటం ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ అటు దేశ రాజకీయాలలో ఒక సంచలనం సృష్టించింది.
 
ఎందుకంటే వెంకయ్య నాయుడు గతంలో ఉప రాష్ట్రపతి కాక ముందు బిజెపి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన కీలక వ్యవహారాల్లో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా చాలా తెలివిగా వెంకయ్య నాయుడుతో కేంద్రంలో ఉన్న పెద్దలచేత రాజకీయాలు చేయించేవారు.
 
ఇటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. గతంలో జగన్ అనేకసార్లు ఢిల్లీ పర్యటన చేపట్టిన గాని ఏనాడు కూడా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భేటీ కాకపోవడం పట్ల అనేక కామెంట్లు రావడంతో తాజాగా జగన్ మర్యాదపూర్వకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జగన్ తో పాటు పార్టీ ఎంపీలు మరియు సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.Top