బాబు మాటలు వింటే మాకే షాక్ వస్తున్నాయి అంటున్న బిజెపి ఎంపీ..!

Written By Aravind Peesapati | Updated: August 09, 2019 10:56 IST
బాబు మాటలు వింటే మాకే షాక్ వస్తున్నాయి అంటున్న బిజెపి ఎంపీ..!

బాబు మాటలు వింటే మాకే షాక్ వస్తున్నాయి అంటున్న బిజెపి ఎంపీ..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీలో ఉన్న నేతలను తమ పార్టీలోకి చేర్చుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు బీజేపీ నేతలు. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 ఎన్నికల్లో టిడిపిని దారుణంగా అతితక్కువ స్థానాలతో కేవలం 23 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం పై ఇటీవల తన ఓటమి గురించి చంద్రబాబు చేస్తున్న కామెంట్లను విని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు పార్టీ ఈ విధంగా ఓడిపోతుందని తన ఊహించలేదని...ఏదో జరిగిందని ఇటీవల తన పర్యటనలో ప్రజల ముందు వాపోయారు బాబు. దీంతో తాజాగా బాబు చేసిన కామెంట్లకు షాక్ అవుతున్నారు బిజెపి నేతలు. కేంద్రం చేసిన ఎన్నో మంచి పనులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అడ్డుకున్నందువల్లే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు అన్నారు. అయినా ఓటమికి కారణాలు అర్థం కావడం లేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. జగన్ పాలనపై ఆరు నెలల తర్వాత స్పందిస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వానికైనా కొంత వ్యవధి ఇవ్వాలని, ఆ తర్వాత ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) బిల్లుపై అపోహలు అవసరంలేదని ఆయన అన్నారు.
Top