Advertisement

వచ్చిన ఓటమికి లోకేష్ కి మతిభ్రమించింది..!

by Aravind Peesapati | August 09, 2019 10:57 IST
వచ్చిన ఓటమికి లోకేష్ కి మతిభ్రమించింది..!

వచ్చిన ఓటమికి లోకేష్ కి మతిభ్రమించింది..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేష్ కి మతిభ్రమించింది అని వైసీపీ నేత నగర ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు, లోకేశ్‌లు యువతను మోసం చేశారని ఆమె ద్వజమెత్తారు. గు 4 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనత అన్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అందేలా సీఎం వైఎస్‌ జగన్‌ చట్టం చేశారని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొదిస్తామని చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు.అనంతపురం జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడారు.


Advertisement


Advertisement


Top