పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి..!

Written By Aravind Peesapati | Updated: August 09, 2019 10:59 IST
పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి..!

పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి..!
 
ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో భయంకరమైన అవినీతి జరిగిందని ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ దారుణమైన విమర్శలు చేసిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇదే క్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఎప్పటినుండో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతిపై రకరకాల పోస్టింగ్ లు పెడుతూ ఆంధ్ర రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇటీవల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల రాష్ట్రంలో అధిక వర్షాలు కురవడంతో పోలవరం ప్రాంతంలో ముప్పు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా ఏపీ సీఎం జగన్ పర్యటించడం జరిగింది. ఈ ముంపు ప్రాంతాలకు కానీ టీడీపీ నేతలు వస్తే రానివ్వద్దని దీనంతటికి కారణం వారే అని విజయసాయి రెడ్డి “పోలవరం ఎగువన ముంపు గ్రామాలకు తెలుగుదేశం నాయకులు పరామర్శకు వస్తే అడ్డుకోవాలి. ఎలక్షన్ల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి కాఫర్‌ డ్యామ్‌ నిర్మించడం వల్లే ప్రవాహం వెనక్కి తన్ని గ్రామాలు మునిగాయి. చంద్రబాబు క్షమాపణ చెప్పేంత వరకు టీడీపీ నాయకులను అడుగు పెట్టనివ్వొద్దు.” అంటూ ట్వీట్ పెట్టారు.
Top