సొంత పార్టీ ఎంపీ బిహేవియర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు…!

Written By Aravind Peesapati | Updated: August 10, 2019 11:55 IST
సొంత పార్టీ ఎంపీ బిహేవియర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు…!

సొంత పార్టీ ఎంపీ బిహేవియర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు…!
 
అనంతపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ ఇటీవల కియా మోటార్స్ కార్యక్రమానికి విచ్చేసి అంతర్జాతీయ మీడియా సంస్థల ముందు అధికార మదంతో చాలా దారుణంగా మాట్లాడటం పట్ల సొంత పార్టీలో ఉన్న వైసిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కియా మోటార్స్ తొలి కారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం కి వచ్చిన వైసిపి పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరింపు ధోరణి తో కియా మోటార్స్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. కార్యక్రమానికి వచ్చి కియా మోటార్స్ కి శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి బెదిరింపు ధోరణితో మాట్లాడాడు. అది కూడా ఇంటెర్నేషనల్ మీడియా సమక్షములో, జగన్ కి చెప్పి కియా మెడలు వంచిస్తా… ఇంకా చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారంటూ మాట్లాడాడు. ఒక వేళా కియాతో ఇబ్బంది ఉంటే సున్నితమైన హెచ్చరిక చేయాలి కానీ, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ఒక ఇంటెర్నేషనల్ సంస్థని పట్టుకొని మీడియా ముందు అలా మాట్లాడటం దారుణమని సొంత పార్టీ నేతలే పార్టీ లో కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకురావడానికి ముఖ్యమంత్రి జగన్ నానా తంటాలు పడుతున్న క్రమంలో రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు లేని సందర్భంలో ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుందని గోరంట్ల మాధవ్ చేసిన ప్రసంగంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ విషయం జగన్ దాక వెళ్లడంతో గోరంట్ల మాధవ్ పర్సనల్ గా వచ్చి కలవాలని పార్టీ నేతలకు చెప్పినట్లు టాక్.
Top