శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తడం జరిగింది అంతా జగన్ ఎఫెక్ట్..!

Written By Aravind Peesapati | Updated: August 10, 2019 11:57 IST
శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తడం జరిగింది అంతా జగన్ ఎఫెక్ట్..!

శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తడం జరిగింది అంతా జగన్ ఎఫెక్ట్..!
 
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాల కంటే వర్షాలు తగిన సమయంలో పడటంతో వైసిపి పార్టీకి చెందిన చాలా మంది నేతలు నాయకులు కార్యకర్తలు రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రి భగవంతుడు అండ ఉన్న వ్యక్తి అయితే పంచభూతాలు ఇలానే సహకరిస్తాయని ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు పడటం శుభప్రదమని ఇదంతా జగన్ ఎఫెక్ట్ అని అంటున్నారు. ఇందుకు నిదర్శనమే శ్రీశైలం రిజర్వాయర్ లో నీళ్లు నిండటం అని అన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో రిజర్వాయిర్ నిండడంతో సాగర్ లోకి నీటిని విడుదల చేయడానికి వీలుగా గేట్లు ఎత్తారు. శ్రీశైలం జలాశయంలో ఆరు క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ శ్రీశైలం ప్రాజెక్ట్‌ వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటి విడుదల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనడం విశేషం. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2009 తర్వాత రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శుక్రవారం సాయంత్రం 39 గేట్ల ద్వారా 4,98,96 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా... శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 880.90 అడుగుల వద్ద 196.96 టీఎంసీలు చేరింది. అటు... ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి 4.91 లక్షల క్యూసెక్కులు వస్తుండటం, మరికొన్నాళ్లపాటు ఇన్‌ఫ్లో కొనసాగుతుందని స్పష్టం కావడంతో శుక్రవారం సాయంత్రమే గేట్లు తెరిచారు. తొలుత నాలుగు గేట్లను తెరిచి 1,04,772 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. రాత్రి 10 గంటలకు మరో గేటును తెరిచారు. 11 గంటలకు ఆరో గేటును కూడా తెరిచి... 1,59,084 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మరో 15 రోజుల్లో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కూడా నిండే అవకాశముంది.
Top