తెలంగాణలో కాంగ్రెస్ ని ఖాళీ చేస్తున్న బిజెపి..!

Written By Aravind Peesapati | Updated: August 10, 2019 11:58 IST
తెలంగాణలో కాంగ్రెస్ ని ఖాళీ చేస్తున్న బిజెపి..!

తెలంగాణలో కాంగ్రెస్ ని ఖాళీ చేస్తున్న బిజెపి..!
 
ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని చావుదెబ్బ కొట్టిన బిజెపి తెలంగాణ రాష్ట్రంలో కొద్దోగొప్పో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కి చుక్కలు చూపించిన బిజెపి తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ ప్రోగ్రామ్ తో బీజేపీలోకి చేర్చుకోవడం తో కాంగ్రెస్ అధిష్టానంలో కంగారు మొదలయ్యింది. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్.పి వివేక్ రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. వివేక్ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతుందని లక్ష్మణ్ అన్నారు. చాలామంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బలమైన రాజకీయ కుటుంబం నుంచి వివేక్ వచ్చారని తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది నాయకులు బీజేపీలో చేరబోతున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తామని ఎంపీ అరవింద్‌ అన్నారు. ఇంకా చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణ బిజెపి నేతలు పేర్కొన్నారు.
Top