2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచిన క్రమంలో ముఖ్యమంత్రిగా జగన్ అయ్యాక తెలుగుదేశం పార్టీ నేతలు అప్పటినుండి పసలేని అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై టిడిపి అవినీతి ఆరోపణ చేసింది కాని, అందులోనే పప్పులో కాలు వేసినట్లు కనిపిస్తుంది. మాజీ మంత్రి దేవినేని ఉమా ఈ ఆరోపణ చేశారు. సిమెంట్ కంపెనీలు అడిగిన మొత్తాన్ని ఇవ్వలేదన్న కోపంతో ఇసుక కొరత సృష్టించారని ఆయన అన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి, కొత్త విధానం అమల్లోకి వచ్చేలోగా వైసిపి చెందిన నేతలు, కార్యకర్తలను కుబేరులను చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సిమెంట్ కంపెనీలు బస్తాకు రూ.5 ఇవ్వాలని వైకాపాలో చతుష్టయంగా పేరొందిన సజ్జల, గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి డిమాండ్ చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారని టిడిపి మద్దతు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. వారి డిమాండ్‌కు కంపెనీల నుంచి సానుకూల స్పందన రాకపోవడం వల్లే ప్రజలకు ఇసుక లభ్యతను కష్టతరం చేశారని ఆరోపించారు.ఒకపక్క ఇసుక కొరత ఉందని ,మరో పక్క కుబేరులను చేస్తున్నారని అంటారు.ఈ రెండిటిలో ఏదో ఒకటే నిజం అవ్వాలి కదా..నిజంగానే సిమెంట్ కంపెనీలను ఐదు రూపాయల చొప్పున అడిగి ఉంటే ఎగిరి గంతేసి ఇచ్చేవి కాదా? ఆ విషయం ఉమా కు తెలియదని అంటే నమ్మాలా? సిమెంటు కంపెనీలు డబ్బు ఇవ్వలేదంటే అవినీతి జరగలేదనే కదా? ఎక్కడైనా సిమెంట్ కంపెనీల కోసం ఇసుక కొరతను సృష్టిస్తారా? చిత్రమైన వాదనగానే కనిపిస్తుంది. ఇసుక కొరత ఉందని, దానిని తీర్చాలని అడగడం తప్పు కాదు.కాని ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తేనే పరువు పోతుంది అంటూ సోషల్ మీడియాలో దేవినేని వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు.