ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను ఏపీ లో ఉన్న బిజెపి పార్టీ నాయకులు తమ పార్టీలోకి చేర్చుకున్న క్రమంలో తాజాగా అదే ఆపరేషన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ బిజెపి నేతలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో సీనియర్ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రముఖుడు మోత్కుపల్లి నరసింహులు బారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని సమాచారం. ఆయన ఇప్పటికే పార్టీ ప్రదాన కార్యదర్శి పి.మురళీధర్ రావు తో చర్చలు జరిపారు. ఎపి బిజెపి నేత సుధీష్ రాంభొట్ల నివాసంలో వారు చర్చలు చేశారు. అన్ని లాంఛనాలు పూర్తి అయ్యాయని, ఇక బిజెపిలో మోత్కుపల్లి చేరడమే తరువాయి అని అంటున్నారు. ఒక తేదీని నిర్ణయించుకుని ఆయన పార్టీలో చేరవచ్చు. గత ఏడాది టిడిపికి ఆయన రాజీనామా చేశారు.1983 లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన ఒక సారి ఇండిపెండెంట్ గా మరో సారి కాంగ్రెస్ పక్షాన ,మిగిలిన నాలుగుసార్లు టిడిపి పక్షాన గెలిచారు. ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు.పార్టీ చీలిక సమయంలో ఎన్.టి.ఆర్.పక్షాన నిలబడ్డారు. ఆ తర్వాత కొంతకాలం కాంగ్రెస్ లో ఉండి తిరిగి టిడిపిలోకి వచ్చారు. కాని గత ఏడాది చంద్రబాబుపై తీవ్ర విమర్వలు చేసి పార్టీకి దూరం అయ్యారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ హవా కొనసాగుతున్న గ్రామంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీకి అధికార పార్టీ టిఆర్ఎస్ కూడా భయ పడుతున్న నేపథ్యంలో మెతుకుపల్లి నరసింహులు బిజెపి పార్టీలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది.