2014 ఎన్నికల్లో బిజెపి పార్టీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీపై వ్యతిరేకత ఉన్న క్రమంలో బిజెపి పార్టీ ని వ్యతిరేకించి దేశవ్యాప్తంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ఇతర జాతీయ పార్టీలతో కలిసి ప్రచారం చేశారు చంద్రబాబు. అయితే జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీ బంపర్ మెజారిటీతో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావడం మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిపోయింది. ఎప్పటికప్పుడు ఎవరితో పడితే వారితో అవకాశ రాజకీయాలు చేసే చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంతో ఇకపై పొత్తు ఉండదని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తెలుగుదేశం అదినేత చంద్రబాబుకు బిజెపి తలుపులు మూసివేసినట్లు పార్టీ అద్యక్షుడు అమిత్ షా ఎప్పుడో చెప్పారని ఆయన గుర్తు చేశారు.ఆర్టికల్ 370 రద్దు గొప్ప చారిత్రక నిర్ణయమని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇన్నాళ్లు కశ్మీర్ నిప్పుల కుంపటిలా మండిపోయిందని, ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ భారతదేశం భూభాగంలో అంతర్భాగంగా మారిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన నత్తనడకన సాగుతుందని విమర్శించారు.