తెలంగాణలో జరగబోయే సంచలనాన్ని చెప్పేసిన మాజీ తెదేపా నేత..!

Written By Aravind Peesapati | Updated: August 12, 2019 14:09 IST
తెలంగాణలో జరగబోయే సంచలనాన్ని చెప్పేసిన మాజీ తెదేపా నేత..!

తెలంగాణలో జరగబోయే సంచలనాన్ని చెప్పేసిన మాజీ తెదేపా నేత..!
 
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయకత్వంలో దళిత సామాజిక వర్గం లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాష్ట్రం రెండుగా విభజన తర్వాత చంద్రబాబు చేసిన రాజకీయాన్ని తట్టుకోలేక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు తనను రాజకీయంగా అనగా తొక్కే ప్రయత్నం చేశారని టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి పార్టీని ఆక్రమించుకున్నారు అని పార్టీ వీడిన తర్వాత అప్పట్లో మోత్కుపల్లి నరసింహులు షాకింగ్ కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా అప్పటి నుండి ఇప్పటి వరకు మరే పార్టీలో చేరలేదు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ బలపడుతున్న క్రమంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి పార్టీ ఎదుగుతున్న నేపథ్యంలో బిజెపి పార్టీలోకి మోత్కుపల్లి నరసింహులు జాయిన్ అవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో హిందుత్వం పేరుతో బిజెపి పార్టీ చాలా బలంగా బలపడటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి బీజేపీ మీద ఆసక్తి కర వాఖ్యలు చేసి తాను పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేసారు.హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీ చేరేందుకు తేదీని ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో తెరాస పార్టీ ప్రత్యామ్నాయంగా మరో పార్టీ లేదని, బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఎదగనుందని వెల్లడించారు. దేశం కోసం బీజేపీ ఏంచేయడానికైనా సిద్ధంగా ఉందని మోత్కుపల్లి నరసింహులు వ్యాఖ్యానించారు.
Top