భారత్... తస్మాత్ జాగ్రత్త ! త్వరలోనే ఉగ్ర పోరు

Written By Aravind Peesapati | Updated: August 12, 2019 14:10 IST
భారత్... తస్మాత్ జాగ్రత్త ! త్వరలోనే ఉగ్ర పోరు

భారత్... తస్మాత్ జాగ్రత్త ! త్వరలోనే ఉగ్ర పోరు
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మోడీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370 నీ రద్దు చేయటంతో దాయాది దేశం పాకిస్థాన్ కి దిమ్మ తిరిగి పోయింది. గతంలో ఆ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద సంస్థలు భారత్లో అనేక దాడులకు పాల్పడిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో భారత్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్థాన్ దేశంలో పార్లమెంటులో భారత ప్రభుత్వం పై అనేక విమర్శలు కూడా ఇటీవల పాకిస్తాన్ దేశ రాజకీయ నాయకులు చేశారు. దీంతో ఇప్పుడు పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారత్లో ఉగ్రవాద దాడులు చేయడానికి రెడీ అవుతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ తో పాకిస్తాన్ దేశానికి చెందిన కొన్ని ఉగ్రవాద హంసలు చేతులు కలిపి ఈనెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ విధ్వంసానికి కుట్ర చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం. భారత్ ని విచ్చిన్నం చేసే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ ఆర్మీ అండదండలతో ఈ ఉగ్రవాద సంస్థలు పెద్ద ఎత్తున మారణహోమం సృష్టించాలని భావిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. బక్రీద్‌ ప్రార్థనల్లోనూ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో అధికారులు భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.




Top