బాబు కి మరో గతి లేదు. బిజేపీతో కలవనున్న టీడీపి ?

Written By Aravind Peesapati | Updated: August 12, 2019 14:11 IST
బాబు కి మరో గతి లేదు. బిజేపీతో కలవనున్న టీడీపి ?

బాబు కి మరో గతి లేదు. బిజేపీతో కలవనున్న టీడీపి ?
 
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో షాకుల మీద షాకులు ఇచ్చారు. టిడిపి పార్టీ పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు ఓడిపోలేదు అన్న విధంగా 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ ని చావు దెబ్బ కొట్టారు జగన్. దీంతో తెలంగాణ రాష్ట్రంలో చాలావరకు కనుమరుగైపోయిన టిడిపి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పార్టీ తో చేతులు కలిపి ఆంధ్ర లో గెలిచిన తర్వాత అతి తక్కువ కాలంలోనే బీజేపీపై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత రావటంతో వెంటనే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన చంద్రబాబుకి రాష్ట్రంలో వైసీపీ పార్టీ దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ అదిరిపోయే షాకులు ఇవ్వటం జరిగింది. దీంతో ఇప్పుడు పరిస్థితి అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనూ చంద్రబాబుకి తీవ్ర వ్యతిరేకత రాజకీయ వాతావరణం ఉండటంతో ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు మళ్లీ బీజేపీ పార్టీలో కలిస్తేనే తప్ప మరో గతి లేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top